కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. దాదాపు అర గంట పాటు వీరి భేటీ కొనసాగింది. రాష్ట్రానికి సంబంధించిన పెండింగ్ సమస్యలు, దిశ బిల్లుకు చట్టబద్ధత, మండలి రద్దు సహా పలు అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
