ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే..పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం..కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూపై ఆంక్షలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ ను జూన్‌ 20 వరకూ పొడిగించింది. అయితే.. జూన్‌10 తర్వాత కర్ఫ్యూ సమయాల్లో పొడిగింపు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూను సడలింపు ఉంటుందని వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాలు ఉ.8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేస్తాయని వెల్లడించింది.