ఏపీ లో పది పరీక్షలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 10 నుండి 15 వరకు పరీక్షలు నిర్వహించనుంది. జులై 10న మొదటి లాంగ్వేజ్, 11న సెకండ్ లాంగ్వేజ్, 12 ఇంగ్లీష్, 13న మ్యాథ్స్, 14న జనరల్ సైన్స్ 15న సోషల్ స్టడీస్ పేపర్లను నిర్వహించనుంది. కరోనా దృష్ట్యా 11 పేపర్లు జరగాల్సిన పరీక్షలను ఆరుపేపర్లకు కుదిస్తున్నట్లు ప్రకటించింది. ప్రతీపేపర్‌కు వందమార్కులు ఉంటాయని తెలిపింది. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు ధరించి పరీక్షలకు హాజరుకావాలని విద్యార్థులకు సూచించింది.
