జగన్‌ను కలిసిన మాజీ క్రికెటర్ అనిల్ కుంబ్లే

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం వైయస్‌ జగన్‌ను ఇండియన్‌ టెస్ట్ క్రికెట్‌ టీం మాజీ కెప్టెన్‌ అనిల్‌ కుంబ్లే సోమవారం నాడు ముఖ్యమంత్రి క్యాంప్‌ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసారు. కర్ణాటక రాష్ట్రానికి చెందిన అనిల్‌ కుంబ్లే.. ఏపీ సీఎంతో భేటీ కావడం ప్రస్తుతం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, టీమిండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనిల్‌ కుంబ్లే.. భారత జట్టు ప్రధాన కోచ్‌ సహా బీసీసీఐలో పలు ఉన్నత పదవులు చేపట్టాడు. టెస్టులో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్లలో మొదటి స్థానం, ప్రపంచ దేశాల బౌలర్లలో 3వ స్థానంలో నిలిచిన ఘనత కుంబ్లేకు దక్కుతుంది.