గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ చూశారా.?

ఫుల్ గా నవ్విస్తు భయపెట్టిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రలో పదేళ్ల క్రితం వచ్చిన హారర్ కామెడీ సినిమా గీతాంజలి అప్పట్లో భారీ విజయం సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ గా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమాని తీసుకొస్తున్నారు. ఇప్పటికే టీజర్, సాంగ్స్ రిలీజ్ చేయగా తాజాగా గీతాంజలి మళ్ళీ వచ్చింది సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. కోన వెంకట్ నిర్మాణంలో శివ తుర్లపాటి ఈ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఏప్రిల్ 11న థియేటర్స్ లోకి రానుంది. ఫుల్ గా నవ్విస్తు భయపెట్టిన గీతాంజలి మళ్ళీ వచ్చింది ట్రైలర్ మీరు కూడా చూసేయండి. ఇక ఈ సినిమాలో శ్రీనివాస రెడ్డి, సత్యం రాజేష్, షకలక శంకర్, అలీ, రవి శంకర్.. పలువురు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అంజలికి 50వ సినిమా.