మరో శుభవార్త చెప్పిన ప్రధాని మోడీ

మరో శుభవార్త చెప్పిన ప్రధాని మోడీ

దేశవ్యాప్తంగా మహమ్మారి కరోనా వైరస్ కేసులు భయంకరంగా పెరుగుతున్న నేపథ్యంలో, ఈ వైరస్ ని నివారించడానికి మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా మూకుమ్మడిగా దేశం మొత్తం లాక్ డౌన్ ని విధించాయి. ఎంతకీ ఈ వైరస్ వ్యాప్తి తగ్గకపోవడంతో, మే నెల 3 వరకు లాక్ డౌన్ ని పొడగించాయి. కాగా ఈ లాక్ డౌన్ వలన దేశవ్యాప్తంగా అన్ని సేవలు, వ్యవస్థలు ఎక్కడికక్కడే స్తంభించిపోయాయి. దీంతో దేశంలో ఆర్థిక సంక్షోభం బాగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రజలు, వ్యాపారులు అందరు కూడా డిమాండ్ చేస్తుండటంతో, కేంద్ర హోంశాఖ మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించింది.

ఇకనుండి దేశ వ్యాప్తంగా అన్ని రకాల షాపులు తెరుచుకోవడానికి అనుమతి ఇచ్చింది. కానీ ఇందులో పలు కీలకమైన షరతులను విధించింది. షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్‌లో రిజిస్టర్ అయిన షాపులు మాత్రమే తెరవొచ్చని తెలిపింది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈ రూల్స్ ఏవి కూడా వర్తించవు. అంతేకాకుండా హాట్ స్పాట్లు, కంటైన్‌మెంట్ జోన్లు ఉన్నచోట మాత్రం ఏ రాష్ట్రంలోనైనా సరే, షాపులు తెరవడానికి కేంద్రం ససేమిరా ఒప్పుకోలేదు. కాగా ఇకనుండి స్టేషనరీ షాపులు, బ్యూటీ సెలూన్స్, డ్రై క్లీనర్స్, ఎలక్ట్రికల్ స్టోర్స్ వంటివి అన్నీ తెరచుకోవచ్చు. కానీ కొంత మంది ఉద్యోగులతోనే, సామాజిక దూరాన్ని పాటిస్తూ, అందరు కూడా తప్పనిసరిగా మాస్కులను ధరిస్తూ మాత్రమే ఈ షాపులను నడిపించాలని స్పష్టం చేసింది.