ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ సమావేశాలు గురువారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన 10 మంది మాజీ సభ్యులకు శాసనసభలో నివాళులర్పించారు. బద్వేలు ఎమ్మెల్యే సుధా ప్రమాణస్వీకారంతో అసెంబ్లీ మొదలైంది. ఈ ఒక్క రోజే సమావేశం నిర్వహించాలని భావించగా.. టిడిపి పొడిగించాలని కోరిన పిదప.. బిఎసి సమావేశంలో ఈ నెల 26 వరకు  సమావేశాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. దీంతో  ఈ నెల 26 వరకు అసెంబ్లీ సమావేశాలు కొనసాగనున్నాయి.  అసెంబ్లీ ఆరు నెలల కాలంలో ఒకసారి నిర్వహించాల్సి ఉంటుంది. ఈ నెల 20వ తేదీతో ఆరు నెలలు పూర్తికావస్తున్నందున.. గురువారం నుండి సమావేశాలు జరుగుతున్నాయి.  ఈ సమావేశాల్లో 14 ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం సభ ముందు ఉంచనుంది. మహిళా సాధికారతపై అసెంబ్లీ, మండలిలో చర్చ జరుగనుంది.