ప్రారంభమైన అసెంబ్లీ శీతాకాల సమావేశాలు

ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ముందుగా అనుకున్నట్టు ఒకరోజు కాకుండా 9 రోజులపాటు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 26 వ తేదీవరకూ శీతాకాల సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా ఇవాళ ప్రారంభమైన తొలిరోజు సమావేశంలో ఇటీవల మృతి చెందిన ప్రజా ప్రతినిధులకు సంతాపం ప్రకటించారు. బద్వేలు ఉపఎన్నికలో విజయం సాధించిన ఎమ్మెల్యే డాక్టర్ సుధతో స్పీకర్ తమ్మినేని సీతారామ్ ప్రమాణ స్వీకారం చేయించారు.