లక్నోలో వివాహ వేడుకల్లో జగన్ దంపతులు

లక్నోలో వివాహ వేడుకల్లో జగన్ దంపతులు

గత ఎన్నికల్లో తన గెలుపు కోసం వ్యూహరచన చేసిన ప్రశాంత్ కిశోర్ (పీకే) కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీసమేతంగా వెళ్లారు. ప్రత్యేక విమానంలో ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని లక్నోకు చేరుకున్నారు. ప్రశాంత్ కిశోర్ సంస్థ ఐప్యాక్‌ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ సింగ్ వివాహానికి సీఎం జగన్ హాజరయ్యారు .

లక్నో, గోమ్‌తీనగర్‌లోని హోటల్‌ తాజ్‌మహల్‌లో ఈ వివాహ వేడుక జరిగింది. ఈ వేడుకకు హాజరైన సీఎం జగన్, ఆయన సతీమణి వైఎస్ భారతి నూతన వధూవరులను ఆశీర్వదించారు. అనంతరం సీఎం జగన్ దంపతులు కొద్దిసేపు వారితో ముచ్చటించారు. అనంతరం అర్ధరాత్రి వారు తిరిగి విజయవాడ చేరుకోనున్నారు.