వాలంటీర్లకు గుడ్యూస్.. త్వరలో రూ.30వేలు

వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని ఫిబ్రవరి 15న గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సీఎం జగన్ ప్రారంభించనున్నారు. మండలానికి ఐదుగురు/ మున్సిపాలిటీలో 10 మంది వాలంటీర్లకు సేవారత్న కింద రూ.20వేలు, నియోజకవర్గంలో ఐదుగురికి సేవా వజ్ర కింద రూ.30వేలు, సేవా మిత్ర కింద మిగతా వారికి రూ. 10వేలు ఇస్తారు. వాలంటీర్ల హాజరు, పెన్షన్ పంపిణీ, ఇతర సర్వేల ఆధారంగా అర్హులను ఎంపిక చేస్తారు.