నేడు పోలవరం ప్రాజెక్టుకు జగన్‌

నేడు పోలవరం ప్రాజెక్టుకు జగన్‌

ఇవాళ పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారు ఏపీ సీఎం జగన్‌. ఉదయం 10 గంటల 50 నిమిషాలకు ప్రాజెక్టు వద్దకు చేరుకోనున్నారు. పనుల పురోగతిపై ఏరియల్ సర్వే నిర్వహిస్తారు. మధ్యాహ్నం పన్నెండున్నర వరకూ పనులను పరిశీలిస్తారు సీఎం. ఆ తర్వాత  ఇరిగేషన్‌, ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులతో భేటీ అయి పనులపై రివ్యూ చేయనున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పోలవరానికి జగన్‌ వెళ్లడం ఇది రెండోసారి. ముఖ్యమంత్రి పర్యటనకు ఇటు అధికారులు గట్టి బందోవస్తు ఏర్పాటు చేశారు. సీఎం పర్యటించే ప్రాంతాల్లో సెక్యూరిటీ పెంచారు. జిల్లా ఎస్పీ ఎప్పటికప్పుడు భద్రతా ఏర్పాట్లపై రివ్యూ చేస్తున్నారు. ఇక మరో పక్క ఈరోజు అక్రమాస్తుల కేసులో జగన్ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరు కావలసి ఉంది. మరి ఆయన పోలవరం పర్యటనకి వెళుతుండడంతో కోర్టుకు హాజరు కాక పోవచ్చు.