కేసీఆర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్‌

కేసీఆర్‌ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జగన్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు ఏపీ సీఎం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేర‌కు ట్విట్టర్‌లో అభినందన సందేశాన్ని ఉంచారు. ‘మీకు ఎల్లప్పుడూ ఆ దేవుని కృప ఉండాలి. మీరు ఆయురారోగ్యాలతో చిరకాలం వర్ధిల్లాలి. సుదీర్ఘకాలం ప్రజాసేవలో కొనసాగాలి. మీకు హార్ధిక శుభాకాంక్షలు’ అంటూ జగన్‌ ట్వీట్‌ చేశారు.