నేడు ఢిల్లీకి ఏపీ ముఖ్యమంత్రి జగన్

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి ఢిల్లీ వెళ్ళనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, జలవనరులశాఖ మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సహా పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు. ఈ పర్యటనలో పోలవరంతో పాటు రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను వారితో చర్చించనున్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు తెలిపాయి.