వరద ప్రభావిత ప్రాంతాల్లో జగన్ ఏరియల్ సర్వే

 వాగులు, వంకలు పొంగిపొర్లడంతో వరదనీరు ముంచెత్తింది. వేలాది ఎకరాల్లో చేతికి రావల్సిన పంట దెబ్బతింది. భారీ వర్షాలు, వరదల కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు, పరిశీలించేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఏరియల్ సర్వే చేశారు.

ఇప్పటికే  పలుసార్లు అధికారులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు. అటు వరద కారణంగా నష్టపోయిన రాష్ట్రానికి సహాయం చేయాలని కేంద్రానికి లేఖ రాశారు. ప్రాధమిక అంచనా ప్రకారం  4 వేల 450 కోట్ల నష్టం వాటిల్లిందని..తక్షణ సహాయంగా 2 వేల 250 కోట్లు విడుదల చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు జగన్ విజ్ఞప్తి చేశారు.