ఖర్చులు తగ్గించుకోండి, చౌకగా విద్యుత్ కొనండి.. డిస్కంలకు జగన్ ఆదేశాలకు

ఖర్చులు తగ్గించుకోండి, చౌకగా విద్యుత్ కొనండి.. డిస్కంలకు జగన్ ఆదేశాలకు

సాధ్యమైనంత వరకు ఖర్చులను తగ్గించుకోవాలని డిస్కంలకు సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. తక్కువ ధరకు విద్యుత్‌ను ఆఫర్ చేసే సంస్థల నుంచి కరెంట్ కొనుగోలు చేయాలని ఆయన సూచించారు. ఇలా చేయడం వల్ల నష్టాలను తగ్గించుకునే అవకాశం ఉందన్నారు. హైడ్రో రివర్స్ పంపింగ్ ప్రాజెక్టుల మీద కచ్చితంగా శ్రద్ధ పెట్టాలని ఆయన డిస్కంలకు సూచించారు. టీడీపీ హయాంలో ఎక్కువ ఖర్చుకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల జెన్కో, డిస్కంలు అప్పుల పాలయ్యాయన్నారు. ఐదేళ్లలో డిస్కంలు తిరిగి పుంజుకునేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.