కేబినెట్ భేటీలో మంత్రులతో జగన్ ఆసక్తికర చర్చ!

కేబినెట్ భేటీలో మంత్రులతో జగన్ ఆసక్తికర చర్చ!

ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ భేటీ తర్వాత సీఎం జగన్.. మంత్రులకు పలు కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి దిశా నిర్దేశం చేశారట. ఈ నెలలోనే ఎన్నికలు జరగనుండటంతో.. గెలుపే లక్ష్యంగా పనిచేయాలని చెప్పారట. స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవ్వాలని మంత్రులను ముఖ్యమంత్రి ఆదేశించారట. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వ్యూహాలు సిద్ధం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో చుక్క మద్యం, ఒక్క రూపాయి పంచిన జైలుకు వెళ్లాల్సిందేనన్నారట సీఎం. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీ కట్టడి చేసే విషయంలోఅధికార పార్టీ నేతలనూ ఉపేక్షించేది లేదని చెప్పేసారట. మద్యం, డబ్బుకు అవకాశమే ఉండకూడదన్నారట. ఒకటి రెండు రోజుల్లో రిజర్వేషన్లపై ఉత్తర్వులు వెలువడే సూచనలు ఉన్నాయని.. హైకోర్టు తీర్పునకు అనుగుణంగా రిజర్వేషన్లు ఉంటాయని సంకేతాలు ఇచ్చారట. 50శాతానికి కుదిస్తూ ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.