జాతీయ జెండాను ఆవిష్కరించిన జగన్

విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు. వాహనంలో ముఖ్యమంత్రితో పాటు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి, సిఎస్ సమీర్ శర్మ ఉన్నారు. అనంతరం మువ్వన్నెల పథకాన్నిి ఆవిష్కరించిన సీఎం పోలీసుల నుంచి గౌరవ వందనం అందుకున్నారు.