దేశంలోనే తొలిసారిగా.. దిశ పీఎస్‌కు సీఎం జగన్ శ్రీకారం

దేశంలోనే తొలిసారిగా.. దిశ పీఎస్‌కు సీఎం జగన్ శ్రీకారం

మహిళలక రక్షణగా జగన్ సర్కార్ మరో ముందడుగు వేసింది. ఆడవాళ్ల భద్రతకు భరోసా ఇచ్చేందుకు దిశ చట్టం తీసుకొచ్చిన ప్రభుత్వం.. తాజాగా దిశ పేరుతో పోలీస్ స్టేషన్లకు శ్రీకారం చుట్టింది. తొలి పీఎస్‌ను తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమయ్యింది. అంతేకాదు మహిళల కోసం దిశ యాప్‌ను సిద్ధం చేశారు.. దీనిని సీఎం జగన్ లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, డీజీపీలు పాల్గొన్నారు.