ఏపీలో రైతులకు జగన్ లేఖ

ఏపీలో రైతులకు సీఎం జగన్ లేఖ

ఏపీలో రైతులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లేఖ రాశారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా వరుసగా రెండో ఏడాది ‘రైతు భరోసా’ సాయం 49 లక్షలకుపైగా కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది అన్నారు. రైతు భరోసా సొమ్ము శుక్రవారం జమ కానుందని.. రైతు సంతోషమే రాష్ట్రం సంతోషమని ఆ లేఖలో తెలిపారు. ఏటా ఖరీఫ్‌కు ముందే మే నెలలోనే రైతు భరోసా సొమ్ము అందిస్తామనే మాటను నిలబెట్టుకుంటూ నగదు జమ చేస్తున్నట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలోనూ రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.లేఖ చివరిలో రైతులకు సొమ్ము ముట్టినట్టుగా రశీదు కూడా జతపరిచారు.

జగన్ రైతులకు రాసిన లేఖ ఇలా ఉంది.. ‘ఆరుగాలం తన స్వేదం, రక్తం ధారపోసి రైతన్న దేశ ప్రజలందరి ఆహారానికి భరోసా ఇస్తుంటే… ఆ రైతన్నకు మన ప్రభుత్వాలు ఇస్తున్న భరోసా ఏమిటన్న ఆలోచనతోనే వైయస్సార్‌ రైతు భరోసా కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. రైతు సంతోషమే రాష్ట్రం సంతోషమని నమ్మి… అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే వైయస్సార్‌ రైతు భరోసా- పీఎం కిసాన్‌ కార్యక్రమాన్ని మన ప్రభుత్వం గత ఏడాది దసరా వేళ ప్తారంభించింది. ఏటా ఖరీఫ్‌కు ముందే, మే నెలలోనే రైతు భరోసా సొమ్మును అందిస్తాం అన్న మాటను నిలబెట్టుకుంటూ… రాష్ట్రంలో దాదాపు 49 లక్షలకు పైగా రైతు కుటుంబాలకు రైతు భరోసా సొమ్మువరసగా రెండో ఏడాది వారి ఖాతాల్లో జమ చేయటం జరుగుతుందన్నారు’.