ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. గంటన్నర పాటూ ముఖ్యమంత్రి జగన్ ప్రధానితో సమావేశమయ్యారు.. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. సీఎం జగన్ వెంట వైఎస్సార్‌సీపీ ఎంపీలు కూడా ప్రధానిని కలిశారు. ముందు జగన్ ఎంపీలతో కలిసి 50 నిమిషాల పాటూ కీలక అంశాలపై చర్చించారు. తర్వాత మోదీతో జగన్ ఏకాంతంగా చర్చలు జరిపారు. అనంతరం ఢిల్లీ నుంచి తిరిగి రాష్ట్రానికి బయల్దేరారు. వాస్తవానికి అమిత్ షాను కలవాల్సి ఉన్నా.. ఆయన అపాయింట్‌మెంట్ ఖరారు కాకపోవడంతో తిరుగు పయనమయ్యారు.
