మహిళల దినోత్సవంపై సీఎం జగన్ స్పెషల్ ట్వీట్

మహిళల దినోత్సవంపై సీఎం జగన్ స్పెషల్ ట్వీట్

ఇవాళే అంతర్జాతీయ మహిళ దినోత్సవం. ఈ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా మహిళలు ఈ వేడుకను ఎంతో ఘనంగా చేసుకుంటున్నారు. వివిధ రంగాల్లో పనిచేస్తున్న మహిళలకు…అటు కుటుంబసభ్యులు, ఇటు తోటి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా… అంతర్జాతీయ మహిళ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా సీఎం ట్వీట్ చేశారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఉన్నతిని సాధించిన నాడే దేశం నిజమైన అభివృద్ధి దిశగా పయనిస్తుందన్నారు. అమ్మఒడి నుండి పేదలకు ఇళ్ల పట్టాల వరకు.. మన ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకం అంతిమంగా మహిళా సాధికారతకు తోడ్పడుతున్నందుకు సంతోషంగా ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు.