మత్స్యకార భరోసా పథకం నిధులను విడుదల చేసిన జగన్‌

వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ‘మత్స్యకార భరోసా’ పథక నిధులను విడుదల చేశారు. మంగళవారం ఉదయం కంప్యూటర్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాలకు నేరుగా నగదు జమ చేశారు. సముద్రంలో చేపల వేట నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకార కుటుంబాలకు ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ‘వైఎస్సార్‌ మత్స్యకార భరోసా’ పథకాన్ని వరుసగా మూడో ఏడాది కూడా అమలుచేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకంలో అర్హత ఉన్నవారిని ఒక్కరిని కూడా వదలకుండా 1,19,875 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున రూ.119,87,50,000 మేర లబ్ధి కలగనుంది. గతంలో రూ.4 వేల చొప్పున మాత్రమే ఇచ్చిన భఅతి మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది.