వైద్య, ఆరోగ్య శాఖపై సీఎం జగన్‌  సమీక్ష

రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంబంధిత మంత్రులతో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ విధానంపై సీఎం సమీక్షించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు.