వైఎస్ పేరుతో జగన్ కొత్త పథకం..

ఏపీలో మరో వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది జగన్ సర్కార్. ‘డాక్టర్ వైఎస్‌ఆర్ చిరునవ్వు’ పథకం పేరుతో ఒకటో నుంచి 6వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా దంత వైద్యం అందిస్తారు. విద్యార్థులకు పీహెచ్‌సీలలో డెంటల్ చెకప్ చేసి.. ప్రతి ఒక్కరికి ఉచితంగా టూత్‌పేస్ట్, బ్రష్ అందించనున్నారు. 60 లక్షల మంది చిన్నారులకు స్క్రీనింగ్‌ చేసేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. గురువారం వైద్య, ఆరోగ్య శాఖపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి జగన్.. ఈ పథకంపై చర్చించారు. వైఎస్‌ఆర్ జయంతి రోజు జులై 8న పథకాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.