ఆంధ్రప్రదేశ్‌లో తాజాగా మరో 36 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2100కి చేరింది. ఇప్పటి వరకు వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని 1192 మంది డిశ్చార్జ్ కాగా, 48 మంది మరణించారు. ప్రస్తుతం 860 మంది కరోనా బాధితులు చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 52 మంది డిశ్చార్జ్ అయ్యారు. కాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 9256 సాంపిల్స్ పరీక్షించగా.. 68 మంది కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారింపబడ్డారు. వీటిలో 32 పాజిటివ్ కేసులు ఇతర రాష్ట్రాల వారికి చెందివని
