మూడు రాజధానుల బిల్లు వెనక్కు : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల బిల్లు ఉపసంహరిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్వొకేట్ జనరల్‌ స్వయంగా హైకోర్టుకు తెలిపారు. ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశంలోనూ మూడు రాజధానులపైనే చర్చ జరిగింది. అయితే, మూడు రాజధానులపై ప్రభుత్వం వెనక్కు తగ్గిందా లేదా తన వ్యూహం మార్చిందా అన్నదే అంతుపట్టడం లేదు. మూడు రాజధానులపై టెక్నికల్‌గా సమస్యల్ని పరిష్కరించి మళ్లీ బిల్లులు పెడతారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సాగు చట్టాల్ని రద్దు చేస్తూ మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఏపీ సీఎం జగన్ కూడా అదే బాటలో వెళ్తున్నారా అనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే, అమరావతికి మద్దతుగా వెళ్లాలని ఏపీ బీజేపీ నేతలకు అమిత్‌షా ఆదేశాలు జారీ చేశారు.