ఎపి లో పరిషత్ ఎన్నికలను హైకోర్టు రద్దు చేసింది. ఎంపిటిసి, జడ్‌పిటిసి ఎన్నికలపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సుప్రీం సూచించిన నిబంధనల ప్రకారం.. పరిషత్ ఎన్నికలను నిర్వహించలేదని హైకోర్టు పేర్కొంది. ఈ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించింది. ఎపి లో ఏప్రిల్ 7 న పరిషత్ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల నిర్వహణకు సంబంధించి గతంలో టిడిపి, బిజెపి, జనసేన పార్టీలు పిటిషన్లు వేశాయి. ఎన్నికలను నిర్వహించిన తరువాత ఫలితాలను ఇవ్వకూడదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో.. నేడు విచారణ చేపట్టిన హైకోర్టు, పరిషత్ ఎన్నికలను రద్దు చేస్తూ కీలక ఆదేశాలనిచ్చింది.
