ఏపీ శాసనమండలి ఛైర్మన్ సంచల నిర్ణయం

ఏపీ శాసనమండలి ఛైర్మన్ సంచల నిర్ణయం

మూడు రాజధానులు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులపై మండలి ఛైర్మన్ షరీఫ్ దూకుడు పెంచారు. సెలక్ట్ కమిటీలను ఏర్పాటు చేశారు. మూడు రాజధానుల బిల్లుకు సెలక్ట్ కమిటీ చైర్మన్‌గా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించారు. ఈ కమిటీ సభ్యులుగా టీడీపీ తరపున నారా లోకేష్, పీ.అశోక్‌బాబు, తిప్పేస్వామి, గుమ్మడి సంధ్యారాణి.. పీడీఎఫ్‌ నుంచి లక్ష్మణరావు, బీజేపీ నుంచి మాధవ్‌.. వైఎస్సార్‌సీపీ నుంచి వెన్నపూస వేణుగోపాల్‌రెడ్డిలు ఉన్నారు.

సీఆర్డీఏ రద్దు బిల్లు సెలక్ట్‌ కమిటీ చైర్మన్‌గా మంత్రి బొత్స సత్యనారాయణను నియమించారు. టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్‌రెడ్డి, అర్జునుడు, రవిచంద్ర యాదవ్, గౌనివారి శ్రీనివాసులు ఉన్నారు. వైసీపీ నుంచి మహ్మద్ ఇక్బాల్, పీడీఎఫ్ నుంచి వెంకటేశ్వరరావు, బీజేపీకి చెందిన సోము వీర్రాజులు సభ్యులుగా ఉన్నారు.

కమిటీల ఏర్పాటు సంగతి అలా ఉంటే.. ఇది రాజ్యాంగ విరుద్ధమని మంత్రులు, వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది. తాము ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండబోమని మండలి ఛైర్మన్‌కు లేఖ రాసింది. నోటి మాట ద్వారా సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కాదని.. కమిటీ ఏర్పాటుకు కొన్ని విధానాలు ఉంటాయంటున్నారు మంత్రులు. మండలి ఛైర్మన్ సెలెక్ట్ కమిటీకి రిఫర్ చేసే ప్రక్రియ పూర్తి కాలేదని.. అలాంటప్పుడు విచక్షణాధికారం ఉందని ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదన్నారు.