ఏపీ అసెంబ్లీలో కులగణన తీర్మానం

కులగణన చేయాలని కేంద్రాన్ని కోరుతూ ఏపీ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ మేరకు ఈ తీర్మానాన్ని రాష్ట్ర మంత్రి వేణుగోపాల్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సిఎం జగన్‌ మాట్లాడుతూ 1931 తరువాత కులపరమైన జనాభా గణన జరగలేదని తెలిపారు. దేశంలో వెనకబాటుతనం తెలుసుకోవాలంటే లెక్కలు అవసరమని సీఎం స్పష్టం చేశారు. కులగనణపై కేంద్రానికి అనేక ప్రతిపాదనలు పంపామని గుర్తుచేశారు. కులగణన డిమాండ్‌కు తాము మద్దతు తెలుపుతున్నామని ఆయన చెప్పారు. దేశంలో బీసీల జనాభా 52 శాతంగా ఉన్నారని పేర్కొన్నారు. బీసీలంటే బ్యాక్‌వర్డ్‌ క్లాస్‌ కాదు.. బ్యాక్‌ బోన్‌ క్లాస్‌ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. బీసీలను రాజకీయంగా, ఆర్థికంగా అభివఅద్ధి చెందేందుకు కులగణన మరింత వెసులుబాటు కలుగుతుందని అన్నారు.