ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ను అధికారులు విడుదల చేశారు. మొత్తం మూడుదశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్ని ఒకే దశలోను, గ్రామ పంచాయతీ ఎన్నికల్ని మాత్రం రెండు దశల్లో నిర్వహిస్తామన్నారు. ఈనెల 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహించి 27వ తేదీన ఫలితాలు ప్రకటిస్తామన్నారు. ఈనెల 27న పంచాయతీ ఎన్నికలు ఉంటాయన్నారు. 29న రెండో విడదత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. మున్సిపల్ ఎన్నికలకు ఈనెల 9 నుంచి 11 వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. 14వ తేదీ నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు. పంచాయతీ ఎన్నికలకు 17 నుంచి 19వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఈనెల 21న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. 27వ తేదీన తొలివిడత పంచాయితీ ఎన్నికలు, 29న రెండోవిడత పంచాయతీ ఎన్నికలు జరుగుతాయన్నారు. 29న ఓట్ల లెక్కింపు ఉంటుందన్నారు. మొత్తం 660 జడ్పీ, 9639 ఎంపీటీసీలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎన్నికల షెడ్యూల్ వివరాలు ఒకసారి పరిశీలిస్తే….
మార్చి 9 నుంచి 11 వరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ పరిషత్ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ
మార్చి 17 నుంచి 19 వరకు పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ
మార్చి 21న ZPTC, MPTC (పరిషత్ ఎన్నికలు) ఎన్నికల పోలింగ్
మార్చి 24న ZPTC, MPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు (కౌంటింగ్)
మార్చి 23న మున్సిపల్ ఎన్నికల పోలింగ్
మార్చి 27న మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్
మార్చి 27న మొదటిదశ సర్పంచ్ (గ్రామ పంచాయతీ) ఎన్నికలు
మార్చి 29న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు
మార్చి 29న ఓట్ల లెక్కింపు