నారా లోకేష్‌పై కేసు నమోదు

తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కాంలో అరెస్టయిన సందర్భంలో పరామర్శ కోసం సూర్యారావుపేట కోర్టు సెంటర్‌కు నారా లోకేష్‌, కొల్లు రవీంద్రతో పాటు పలువురు టీడీపీ నేతలు వెళ్లారు. ఈ సమయంలో లోకేష్‌ కరోనా నిబంధనలు పట్టించుకోలేదని పలువురు ఆయనపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎపిడమిక్‌ యాక్ట్‌ ప్రకారం కరోనా వ్యాప్తికి కారణమయ్యారంటూ నారా లోకేష్‌, కొల్లు రవీంద్ర తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అంతేకాదు, గతేడాది జూన్‌ 12న ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసలు ఇప్పుడు వివరణ ఇవ్వాలని నోటీసులు పంపారు.