నేడు వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వీరితో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఇఖడ్ ప్రమాణం చేయించనున్నారు. కాగా రాజ్యసభలో ఏపీకి ఉన్న 11 సీట్లు వైసీపీ ఖాతాలోకి వెళ్లాయి. తొలిసారి ఎగువ సభలో టీడీపీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది.