6న కావలిలో ఐదో ‘సిద్ధం’ సభ

వైసీపీ ఐదో ‘సిద్ధం’ సభ నెల్లూరు జిల్లా కావలిలో ఈ నెల 6వ తేదీన జరగనుంది. ఈ మేరకు పోస్టర్ను ఎంపీ విజయసాయిరెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి, ఎమ్మెల్యేలు విడుదల చేశారు. కాగా సీఎం జగన్ నిర్వహిస్తున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర నేడు నెల్లూరు జిల్లాలోకి ప్రవేశించనుంది. 5వ తేదీన యాత్రకు విరామం ఉంటుంది. 6న కావలి భారీ బహిరంగ సభలో సీఎం జగన్ ప్రసంగిస్తారు.