లాక్‌డౌన్‌తో హైదరాబాద్‌లో చిక్కుకుపోయిన వారికి ఏపీ ప్రభుత్వం ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడపనుంది. ఈ నెల 16న హైదరాబాద్ నుంచి ఏపీలోని ఆయా డిపోలకు సర్వీసులు మొదలుకానున్నాయి. ప్రభుత్వం నిబంధనలకు అంగీకరిస్తేనే ఈ బస్సుల్లో ప్రయాణించేందుకు అవకాశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్పందన పోర్టల్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి.. సొంత ఊళ్లకు వెళ్లిన తర్వాత జిల్లాలో ఉండే క్వారంటైన్ కేంద్రంలో ఉంటామని అంగీకరిస్తేనే టికెట్లు జారీ చేయనున్నారు.
ఏపీకి వస్తామంటూ ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి 8వేల మంది, రంగారెడ్డి జిల్లా నుంచి 5వేలమంది స్పందన ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఈ 13వేలమంది కోసం బస్సు సర్వీసులు నడపనుంది. ఏసీ బస్సుల్లో గరుడ ఛార్జ్, నాన్ ఏసీ బస్సుల్లో సూపర్ లగ్గరీ ఛార్జీ తీసుకోనున్నారు. ఈ బస్సు సర్వీసులు మియాపూర్-బొల్లారం క్రాన్‌రోడ్, కూకట్‌పల్లి హౌసింగ్‌బోర్డ్, ఎల్బీనగర్‌లలో ప్రయాణికులతో ప్రారంభమవుతాయి. ఎక్కడా నుంచి నేరుగా నేరుగా ఆయా డిపోలకు చేరుకుంటాయి.. మధ్యలో ఎక్కడా ఆగవు. ముందుగా ఆన్‌లైన్ బుకింగ్‌కు అవకాశం ఇస్తారు.. ఈ సర్వీసుల్లో కరెంట్ బుకింగ్ చేసుకునే వీలు లేదు. హైదరాబాద్ తర్వాత బెంగళూరు, చెన్నై నుంచి ఏపీకి వచ్చేవారి కోసం ఆర్టీసీ బస్సులు నడిపే ఆలోచనలో ఉన్నారట.