కడప బద్వేల్‌ ఉప ఎన్నికకు అవసరమైన ఏర్పాట్లు

కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికను స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కె విజయానంద్‌ ఆదేశించారు. ఉప ఎన్నికకు సంబంధించిన అంశాలపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా బుధవారం సమీక్ష నిర్వహించారు. ఓటర్లు మినహా బయట నుంచి వచ్చిన మంత్రులు, పార్లమెంటు సభ్యులు, ఎమ్మెల్యేలు, మండలి సభ్యులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు నియోజకవర్గ పరిధిలో ఉండకుండా చూడాలని ఆదేశించారు. స్థానికంగా ఉన్న హోటల్స్‌, అతిథి గృహాలు, కళ్యాణ మండపాలు, కమ్యూనిటీ హాల్స్‌, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో తనిఖీలు నిర్వహించాలని పోలీసు అధికారులను ఆదేశించారు.