Author Archives: News

ఏపీలో మరో 1908 కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 1,908 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా వైరస్‌ సోకిన వారి సంఖ్య 33,019కి చేరుకుంది. గత 24 గంటల్లో కోవిడ్‌ నుంచి కోలుకుని 952 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 17,467 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా బారినపడి ...

Read More »

ఆపరేషన్‌ ముస్కాన్‌ను ప్రారంభించిన డీజీపీ

బాలల మోమున చిరునవ్వులు పూయించడమే లక్ష్యంగా.. వారికి స్వేచ్ఛను కల్పించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగమే ఆపరేషన్‌ ముస్కాన్‌. బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడమే లక్ష్యంగా ప్రవేశపెట్టిన ఆపరేషన్‌ ముస్కాన్‌ కోవిడ్‌-19 కార్యక్రమాన్ని మంగళవారం ఏపీ డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ మీడియాతో మాట్లాడుతూ.. కోవిడ్ కంట్రోల్‌పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దేశంలోనే మొదటసారిగా ఆపరేషన్ ముస్కాన్ కోవిడ్-19కు శ్రీకారం చుట్టాము..అందులో భాగంగా రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్లు, వివిధ కర్మాగారాల్లో బాలకార్మికులుగా, అనాదలుగా ...

Read More »

విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి

విశాఖ ప్రమాదంపై హోంమంత్రి దిగ్భ్రాంతి

విశాఖ పరవాడ ఫార్మా సిటీలో సోమవారం రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక కార్మికుడు చనిపోయినట్టు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రాంకీ సాల్వెంట్‌ ఫాక్టరీలో రాత్రి 10.30 ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించగా.. కార్మికుడు శ్రీనివాసరావు అగ్నికి ఆహుతయ్యాడు. గాయాలపాలైన మరో కార్మికుడు మల్లేష్‌ను గాజువాకలోని ఆస్పుపత్రి తరలించారు. ప్రమాద సమయంలో అక్కడ మొత్తం ఆరుగురు కార్మికులు ఉన్నారు. మిగతా కార్మికులు సురక్షితంగా ఉన్నట్టు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయంవరకల్లా మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయని వెల్లడించారు. విశాఖపట్నం ఫార్మాసిటీలో జరిగిన పేలుడు ...

Read More »

భారత్ లో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్ లో 9 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ ఉధృతి వేగంగా విస్తరిస్తోంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య మంగళవారం నాటికి 9 లక్షలు దాటింది. గడిచిన 24 గంటల్లో 28,498 కొత్త కేసులు వెలుగు చూశాయి. దేశంలో 28 వేల కేసులు నమోదవ్వడం ఇది వరుసగా మూడో రోజు. దీంతో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 9, 07,645కు చేరింది. ఒక్క రోజులో 540 మంది వైరస్‌తో పోరాడి మృత్యువాత పడ్డారు. మొత్తం మరణాల సంఖ్య 23,727కు చేరింది. మహారాష్ట్రలో నిన్న(సోమవారం) 6,497 కేసులు నమోదవ్వగా ...

Read More »

కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సీఎం జగన్‌ సమీక్ష

కాంట్రాక్ట్‌ ఉద్యోగులపై సీఎం జగన్‌ సమీక్ష

రెగ్యులర్‌ ఉద్యోగుల మాదిరిగా వివిధ ప్రభుత్వ విభాగాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. గ్రీన్‌ ఛానల్లో పెట్టి వారికి నిర్ణీత సమయానికి జీతాలు అందించాలన్నారు. పర్మినెంట్‌ ఉద్యోగుల్లాగానే వారికి సామాజిక, ఆరోగ్య భద్రత కల్పించే దిశగా అధ్యయనం చేయాలని, దీనికి సంబంధించి పూర్తి వివరాలు తనకు అందించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. ప్రభుత్వ విభాగాలతో పాటు, వివిధ సొసైటీలు, విశ్వవిద్యాలయాల్లోని కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాల విడుదలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని ...

Read More »

కర్ణాటక మంత్రికి కరోనా పాజిటివ్‌

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ రోజు రోజుకు విజృంభిస్తోంది. సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా వదలడం లేదు. ఎమ్మెల్యేలు సైతం కరోనా బారిన పడటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కర్ణాటక పర్యటక శాఖ మంత్రి సీటీ రవి తనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు. కర్ణాటకలో కరోనా వైరస్‌ సోకిన మొదటి మంత్రి రవి కావటం గమనార్హం. ‘ఆదివారం నిర్వహించిన కరోనా పరీక్షల్లో నాకు కరోనా పాజిటివ్‌గా తెలింది. అదృష్టవశాత్తు నా భార్య పల్లవి, సిబ్బందికి కరోనా నిర్ధారణ ...

Read More »

24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు

24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉధృతి మరింత పెరుగుతోంది. పాజిటివ్‌ కేసులు 9 లక్షలకు, మరణాలు 23 వేలకు చేరువవుతున్నాయి. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 28,637 కొత్త కేసులు బయటపడ్డాయి. మరో 551 మందిని కరోనా పొట్టనపెట్టుకుంది. దీంతో దేశంలో ఇప్పటిదాకా మొత్తం కేసులు 8,49,533కు, మరణాలు 22,674కు చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ ఆదివారం ప్రకటించింది. కరోనా బాధితుల్లో ఇప్పటివరకు 5,34,620 మంది కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్‌ కేసులు 2,92,258. మహారాష్ట్రలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రంలో 2,46,600 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ...

Read More »

జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో క్వాల్‌కామ్‌ పెట్టుబడి

జియో ఫ్లాట్‌ఫామ్స్‌లో క్వాల్‌కామ్‌ పెట్టుబడి

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు చెందిన జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో విదేశీ సంస్థల పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. తాజాగా క్వాల్‌కామ్‌ వెంచర్స్‌ సం‍స్థ 0.15 శాతం వాటా కోసం రూ.730 కోట్లు పెట్టుబడులు పెట్టిందని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ తెలిపింది. జియో ప్లాట్‌ఫార్మ్స్‌లో ఇది 12వ విదేశీ సంస్థ పెట్టుబడి. క్వాల్‌కామ్‌ పెట్టుబడి పరంగా చూస్తే, జియో ప్లాట్‌ఫార్మ్స్‌ ఈక్విటీ విలువ రూ.4.91 లక్షల కోట్లుగాను, ఎంటర్‌ప్రైజ్‌ విలువ రూ.5.16 లక్షల కోట్లుగా ఉంది.

Read More »

ప్రపంచానికి రష్యా శుభవార్త

కరోనా వైరస్ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచమంతా వేయి కళ్లతో ఎంతో ఆశగా ఎదురుచూస్తోంది. ఇటువంటి సమయంలో ప్రపంచానికి రష్యా ఒక శుభవార్తను అందించింది. సెచెనోవ్‌ మెడికల్‌ యూనివర్శిటీలో కరోనా వ్యాక్సిన్‌కు విజయవంతంగా ట్రయల్స్‌ పూర్తయ్యాయని ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ వాడిమ్‌ తారాసోవ్‌ తెలిపారు. రష్యాలోని గమాలే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీ అండ్ మైక్రోబయాలజీ ఉత్పత్తి చేసిన టీకాతో జూన్ 18 న ట్రయల్స్ ప్రారంభించారు. అందులో భాగంగానే క్లినికల్ ట్రయల్స్‌లో పాల్గొన్న వాలంటీర్ల బృందం బుధవారం డిశ్చార్జ్‌ కానుంది. ఇక రెండో బృందం జూలై 20వ ...

Read More »

109 మంది ఎమ్మెల్యేలు మా వెంటే

109 మంది ఎమ్మెల్యేలు మా వెంటే

సంక్షోభం దిశగా పయనిస్తున్న రాజస్తాన్‌ రాజకీయాల్లో ఎవరి బలాన్ని వారు ప్రకటిస్తున్నారు. తన వెంట 30 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఉన్నారని పార్టీ యువ నాయకుడు, ఉపముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ ఆదివారం తిరుగుబాటు జెండా ఎగరేసిన సంగతి తెలిసిందే. కొందరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తనకు మద్దతిస్తున్నారన్నారు. ప్రస్తుతం అశోక్‌ గహ్లోత్‌ ప్రభుత్వం మైనారిటీలో ఉందని స్పష్టం చేశారు. పైలట్‌ వాట్సాప్‌ గ్రూప్‌ నుంచి ఆదివారం ఈ ప్రకటన వెలువడింది. అయితే, తాజాగా కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి, రాజస్తాన్‌ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ ...

Read More »