Author Archives: News

వేసవిలో మట్టికుండలో నీరు తాగితే బోలెడు లాభాలు..?

ఎంత టెక్నాలజీ డెవలప్ అయినా.. నంబర్ ఆఫ్ ఫీచర్స్‌తో రిఫ్రిజిరేటర్స్ డెవలప్ చేసినా.. మట్టి కుండ ప్రత్యేకతే వేరు. అందులోని నీరు తాగితే వచ్చే మజానే వేరు. ఈ కుండను బంకమట్టితో తయారు చేస్తారు. సహజ ఆల్కలీన్‌గా చెప్పబడే ఇది.. నిల్వ చేసిన నీటి పీహెచ్ లెవల్స్ బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతూ జీర్ణ సమస్యలను దరి చేరనీయదు. ఇందులోని నేచురల్ మినరల్స్ జీవక్రియను మెరుగుపరిచి.. మలబద్ధకాన్ని నివారిస్తాయి. ఒంట్లో వేడిని తగ్గించి.. బరువు తగ్గించడంలోనూ కీలకంగా పనిచేస్తుంది. వేసవిలో తలెత్తే కంటి సమస్యలు, అలెర్జీ నుంచి ...

Read More »

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు..

నంద్యాల జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. ఉత్సవాల రెండవ రోజులో భాగంగా మహా దుర్గ అలంకార రూపంలో భ్రమరాంబికాదేవి భక్తులకు దర్శనమిచ్చింది. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మహా దుర్గ అలంకార రూపంలో ఆశీనులైన అమ్మవారికి కైలాస వాహనం శ్రీ స్వామివారికి అర్చకులు వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి హారతులిచ్చారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు ముందు గురవయ్య నృత్యాలు, పులి బొమ్మల వేషాలు, కోలాటాలు, కన్నడిగుల నృత్యాలు, బ్యాండు వాయిద్యాల నడుమ ...

Read More »

ఉగాది పండుగ రోజున ఆరు రుచులను ఎందుకు తినాలి?

తెలుగు వారి కొత్త సంవత్సరం ఉగాది. పూర్వం నుంచి ఉగాది పండుగకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఉగాది రోజున తినే పచ్చడికి మరింత ప్రత్యేకత ఉంది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఉగాది పచ్చడి తింటే ఎంతో ఆరోగ్యం. తీపి, చేదు, వగరు, పులపు, కారం, ఉప్పు కలిపి ఉగాది పచ్చడిని చేస్తారు. ఉగాది పచ్చడిలో తీపికి గుర్తుగా బెల్లాన్ని కలుపతారు. జీవితంలో సంతోషం ఉండాలని ఇది చెబుతుంది. బెల్లం అనేది తియ్యని రుచికి గుర్తింపు. కష్టాల తర్వాత ఆనందం వస్తుంది. ఉగాది ...

Read More »

కవితకు బిగ్ షాక్ ..బెయిల్ నిరాకరించిన కోర్టు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు నిరాకరిస్తూ.. ఆమె బెయిల్ పిటిషన్ ను కొట్టివేసింది. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు… కవిత బెయిల్ పిటిషన్ ...

Read More »

ఆ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా పేరు..

కన్నడ నటుడు రిషబ్ శెట్టి నటుడిగా, దర్శకుడిగా శాండిల్‌వుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. అయితే ఆయనకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపుని తీసుకొచ్చిన సినిమా కాంతార. తానే నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం 2022లో రిలీజయ్యి పాన్ ఇండియా వైడ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం నేషనల్ లెవెల్ లోనే కాదు ఇంటర్నేషనల్ లెవెల్ లో ఈ సినిమా గురించి మాట్లాడుకున్నారు. ఇలా ఈ సినిమాతో రిషబ్ శెట్టి ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరుని సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఈ మూవీలో రిషబ్ ...

Read More »

శ్రీశైలంలో నేటి నుంచి ఉగాది మహోత్సవాలు ప్రారంభం..

శ్రీశైలం మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలకు విద్యుత్ దీపకాంతులతో ఆలయం ముస్తాబైంది. ఆలయ గోపురాలు విద్యుత్ కాంతులతో ఉగాది మహోత్సవాల శోభ సంతరించుకుంది. శ్రీశైలం మహాక్షేత్రంలో నేటి 6 నుంచి 10 వ తేదీ వరకు ఉగాది మహాత్సవాలు వైభవంగా నిర్వహించేందు దేవస్థానం అధికారులు ఈఓ పెద్దిరాజు సిబ్బంది భక్తుల ఏర్పాట్ల పనులలో నిమగ్నమయ్యారు. ఆలయం సర్వాంగసుందరంగా ముస్తాబయింది. ఆలయంలో నేటి ఉదయం యాగశాల ప్రవేశంతో ఉగాది మహోత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు. మొదటిరోజు అమ్మవారు మహాలక్ష్మి అలంకారంలో‌ భక్తులకు దర్శనమివ్వనున్నారు. రాత్రకి బృంగివాహనంపై స్వామిఅమ్మవార్లు శ్రీశైలం ...

Read More »

టిల్లు గాడి సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం కోసం టోనీ..

టిల్లు స్క్వేర్ సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ లో రూపొందిన ఈ సీక్వెల్ ని మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసారు. ఈ సీక్వెల్ లో అనుపమ పరమేశ్వరన్ లిల్లీగా వచ్చి టిల్లు గాడిని పరేషాన్ చేసి ముప్పతిప్పలు పెట్టేసింది. ఇక లిల్లీ-టిల్లు లొల్లి ఆడియన్స్ ని బాగా నవ్వించి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మేకర్స్ సక్సెస్ మీట్ ని ప్లాన్ చేసారు. ఈ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ...

Read More »

షర్మిల వ్యాఖ్యలపై తొలిసారిగా స్పందించిన అవినాశ్ రెడ్డి

వివేకా హంతకుడు ఎంపీ అవినాశ్ రెడ్డి అంటూ వైఎస్ షర్మిల చేస్తున్న తీవ్ర వ్యాఖ్యల పట్ల ఎంపీ అవినాశ్ రెడ్డి తొలిసారిగా స్పందించారు. ఆమె మాట్లాడుతున్న మాటలు వినడానికి భయంకరంగా ఉన్నాయని అన్నారు. ఆ మాటలను ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు. మసి పూస్తారు, బురద చల్లుతారు… వాళ్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటారు… వాళ్ల విచక్షణకే వదిలేస్తున్నా… దీని గురించి ఎక్కువగా చర్చించాల్సిన అవసరం కూడా లేదు అని అవినాశ్ రెడ్డి స్పష్టం చేశారు. ఎంత మాట్లాడుకోవాలంటే అంత మాట్లాడుకోండి… నాకెలాంటి అభ్యంతరం లేదు… ...

Read More »

గూగుల్‌ ట్రెండ్స్‌లో టాప్‌ సీఎం జగన్‌

ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌ ప్రజల తీర్పు సుస్పష్టంగా ఉండబోతుందని గూగుల్‌ ట్రెండ్స్‌ చెబుతున్నాయి. ఏపీ రాజకీయాల గురించి చేసే వేర్వేరు ప్లాట్‌ఫాంలపై చేసే పోస్టులను విశ్లేషించి, ఎవరిపై ఏ టాపిక్‌పై ఎంత సమయం గడుపుతున్నారన్న దాన్ని బట్టి.. గూగుల్‌ ట్రెండ్స్‌ ఫలితాలు ఇస్తుంది. ఏపీ పాలిటిక్స్‌కు సంబంధించి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి టాప్‌లో ఉండగా.. దరిదాపుల్లో కూడా చంద్రబాబు లేకపోవడం గమనార్హం.

Read More »

కూటమిలో వారికి ప్రిఫరెన్సే లేదు.. సజ్జల కీలక వ్యాఖ్యలు

టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శనివారం తాడేపల్లిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన, టీడీపీ అభ్యర్థులను చంద్రబాబే నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. కూటమిలో జనసేన, బీజేపీకి అసలు ఉనికే లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు అనుకున్న వాళ్లకే టికెట్లు ఇచ్చుకున్నారని తెలిపారు. కూటమిలో చంద్రబాబు ఏది చెబితే అదే జరగాలని కోరుకుంటున్నారన్ని పేర్కొన్నారు. ప్రజలు ఏమనుకుంటారనే ఆలోచన లేకుండా బాబు ప్రవర్తిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ వ్యవస్థలను చంద్రబాబు ...

Read More »