Author Archives: News

వేసవి తాపానికి ఉపశమనం..

సమ్మర్‌ సీజన్‌ వచ్చిందంటే చాలు తెల్లతెల్లటి తాటి ముంజలు ముత్యపు చిప్పల్లా మెరిసిపోతూ మనకు నోరూరిస్తాయి. చెప్పాలంటే కల్తీలేనివి, స్వచ్ఛమైన పండు ఏదైనా ఉందా అంటే.. అది తాటి ముంజలే అని చెప్పొచ్చు. తాటి ముంజలలో విటమిన్ ఎ, కె,బి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయాన్ని వైద్యులు చెబుతున్నారు. వేసవి కాలంలో శరీరం చాలా త్వరగా డీహైడ్రేషన్‌కు గురవుతుంది. అలాంటి పరిస్థితుల్లో తాటిముంజలు శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తాయి. దీన్ని తినడం వల్ల శరీరం చల్లబడుతుంది. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. తాటి ...

Read More »

పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత ప్రశ్నల వర్షం..

ఆంద్రప్రదేశ్‌ లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో అన్ని పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత పోతిన మహేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్‌కు డబ్బు ఎక్కడ నుంచి వస్తుందని ప్రశ్నించారు. 2014 నుంచి 2024 వరకు పవన్ ఎన్ని సినిమాలు చేశారు? అందులో ఎన్ని మూవీలు హిట్ సాధించాయి. ఎన్ని డిజాస్టర్లు అయ్యాయని పోతిన మహేశ్ ప్రశ్నించారు. ఆ సినిమాలకు ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు? ఎంత ట్యాక్స్ కట్టారు? ...

Read More »

శ్రీరామనవమి సందర్భంగా హరిహర వీరమల్లు పోస్టర్ రిలీజ్..

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల హడావిడిలో ఉండటంతో చేతిలో ఉన్న మూడు సినిమాలు పక్కన పెట్టేసారు. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG సినిమాలు పవన్ డేట్స్ కోసం ఎదురుచూస్తున్నాయి. వీటిలో ఎంతో ప్రతిష్టాత్మకంగా, క్రిష్ దర్శకత్వంలో పవన్ మొదటి పాన్ ఇండియా సినిమా అంటూ మొదలుపెట్టిన హరిహర వీరమల్లు సినిమా ఆగిపోయిందని గతంలో వార్తలు వచ్చాయి. ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లింప్స్, పోస్టర్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచారు. కానీ ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం, షూటింగ్ మొదలుపెట్టి ఆపేయడం, మూడేళ్లయినా ...

Read More »

కేరళ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేరళ పర్యటనలో ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో చోటు దక్కించుకున్న సీఎం రేవంత్.. ఇవాళ, రేపు రెండు రోజుల పాటు కేరళలో కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ కీలక నేత అయిన రాహుల్ గాంధీ తరుఫున వయనాడ్‌లో ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ల జాబితాలో ఉన్న సీఎం రేవంత్ తెలుగువాళ్లు ఎక్కడుంటే అక్కడ ప్రచారం చేయనున్నారు. రేవంత్ ...

Read More »

భద్రాద్రిలో కన్నుల పండుగగా సీతారాముల కల్యాణం..

పుణ్యక్షేత్రమైన భద్రాచలంలో జరిగిన సీతారాముల కల్యాణ వైభవాన్ని తిలకించడానికి భక్తులు తరలిరావడంతో భద్రాద్రి భక్తజన సందడితో నిండిపోయింది. శ్రీరాముని కల్యాణం చూడటమే మహద్భాగ్యంగా భావించిన భక్తులు అభిజిత్ లగ్నంలో రామయ్య, సీతమ్మ వార్ల జిలకర బెల్లం కళ్యాణ తంతు చూసి పరవసులయ్యారు. సరిగ్గా 12 గంటలకు భక్తుల జయ జయ ధ్వానాల మధ్య అభిజిత్ లగ్నంలో వధూవరుల శిరస్సుపై జీలకర్ర బెల్లం ఉంచారు. దశరధ మహారాజు, జనక మహారాజు, భక్త రామదాసు చేయించిన మూడు మంగళసూత్రాలను భక్తులకు అర్చకస్వాములు చూపించి సరిగ్గా 12.06 నిమిషాలకు ...

Read More »

చంద్రబాబు పిటిషన్ విచారణ వాయిదా..

స్కిల్ డెవలప్‌మెంట్‌ కేసులో బెయిల్ షరతులు ఉల్లంఘించొద్దని చంద్రబాబుకి సుప్రీంకోర్టు హెచ్చరికలు జారీచేసింది. ఆయన బెయిల్ రద్దు చేయాలని సీఐడీ దాఖలు చేసిన పిటిషన్ విచారణ తేదీని మే 7వ తేదీకి వాయిదా వేసింది. చంద్రబాబు కుమారుడు లోకేశ్ అధికారులను బహిరంగంగా బెదిరిస్తున్నారని, దర్యాప్తుకు భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని సీఐడీ అధికారులు కోర్టుకు వివరించారు. ఇరు పక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. బెయిల్ షరతులు ఉల్లంఘించవద్దని చంద్రబాబుకి స్పష్టం చేసింది, కేసు విచారణను మే-7కు వాయిదా వేసింది.

Read More »

శ్రీరామ నవమి స్పెషల్.. జై హనుమాన్ నుంచి అప్డేట్

డైరెక్టర్ ప్రశాంత్ వర్మ- తేజా సజ్జా కాంబోలో వచ్చిన హనుమాన్ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు భారీగా కలెక్షన్స్ రాబట్టి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. పెద్ద హీరోల సినిమాలను సైతం దాటేసి ఇండియా వైడ్‌గా ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. అయితే దర్శకుడు ఇప్పటికే హనుమాన్ సినిమాకు సీక్వెల్ రాబోతున్నట్లు ప్రకటించాడు. అలాగే జై హనుమాన్ పేరుతో తెరకెక్కించబోతున్నట్లు ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశాడు. దీంతో సినీ ప్రియుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు జై హనుమాన్ షూటింగ్ స్టార్ట్ ...

Read More »

అయోధ్యలో అద్భుత దృశ్యం.. ఈ ఒక్క రోజు మాత్రమే..

నేడు ఎక్కడ చూసినా శ్రీరామనామ స్మరణతో మార్మొగుతుంది. ఇక రామనవమి సందర్భంగా ప్రపంచంలోనే అయోధ్య ప్రత్యేకం కానుంది. రాంలాలా పుట్టిన రోజు వేడుకలు పురస్కరించుకుని అయోధ్య అంతా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఏన్నేళ్లైన చెక్కుచెదరని కళాఖండంలా నిర్మించిన అయోధ్య ఆలయంలో అడుగడుగునా ప్రత్యేకతలే దర్శనమిస్తాయి.. అందులో ఒకటి సూర్య తిలకం. సూర్య అభిషేకం లేదా సూర్య తిలకం అని పిలువబడే ఆచారంలో సూర్యుడు బాలరాముడి నుదిటిపై ముద్దు పెట్టుకుంటాడు. ఏటా శ్రీరామనవమి రోజున గర్భగుడిలో ఉండే రాముడి నుదుటిపై మధ్యాహ్నం 12 గంటలకు, రాముడు ...

Read More »

శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్

ఆంద్రప్రదేశ్‌ సీఎం జగన్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. శ్రీరామ నవమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ సీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆకాంక్షించారు. అలాగే, రామ నవమి సందర్భంగా సీఎం జగన్‌ మేమంతా సిద్ధం బస్సుయాత్రకు నేడు విరామం ఇచ్చారు. ట్విట్టర్‌ వేదికగా సీఎం జగన్‌..తెలుగువారి తొలి పండుగ ఉగాది తర్వాత వచ్చే మరో విశిష్టమైన పండుగ శ్రీరామ నవమి. శ్రీమహావిష్ణువు ఏడో అవతారమైన శ్రీరాముని జన్మదినాన్ని రామ నవమిగా దేశవ్యాప్తంగా ...

Read More »

సీఎం జగన్ ప్రచారానికి నేడు విరామం

మేమంతా సిద్ధం ప్రచారానికి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ నేడు విరామం ఇచ్చారు. పండుగల సమయంలో యాత్రకు ఆయన విరామం ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు శ్రీరామనవమి కావడంతో ఈరోజు విరామం తీసుకున్నారు. పశ్చిమ గోదావరిలో ప్రస్తుతం యాత్ర కొనసాగుతోంది. తణుకు వద్ద తేతలిలో ఆయన రాత్రి బస చేశారు. ఈరోజు కూడా ఆయన ఇక్కడే ఉండనున్నారు. తిరిగి రేపు ఉదయం యాత్ర పున: ప్రారంభం కానుంది

Read More »