బద్వేలు ఉప ఎన్నికలో వైసిపి ఘన విజయం

 బ‌ద్వేల్ ఉప ఎన్నిక‌లో అధికార‌ వైసీపీ విజ‌య‌దుందుభి మోగించింది. వైసీపీ అభ్య‌ర్థి దాస‌రి సుధ భారీ మెజారిటీ సాధించారు. గ‌త‌ ఎన్నిక‌ల్లో దాస‌రి సుధ‌ భ‌ర్త వెంక‌ట సుబ్బ‌య్య 44,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. కానీ ఈ ఎన్నిక‌ల్లో త‌న భ‌ర్త మెజారిటీ బీట్ చేశారు. 11 రౌండ్ల కౌంటింగ్ పూర్త‌య్యే స‌రికి 89,660 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఇంకా ఒక్క రౌండ్‌ మాత్ర‌మే మిగిలి ఉండ‌టంతో వైసీపీ గెలుపు లాంఛ‌న‌మైపోయింది.