కన్నప్పలో కీలక పాత్రలో మరో స్టార్ హీరో..

మంచు విష్ణు ప్రస్తుతం ఓ భారీ బడ్జెట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మంచు విష్ణు చివరిగా జిన్నాతో ప్రేక్షకుల ముందుకు వచాడు. ఇక ఇప్పుడు భారీ బడ్జెట్ కన్నప్ప తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లక్ష్మీ ప్రసన్న పిచర్స్ బ్యానర్ పై మంచు మోహన్ బాబు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో మంచు విష్ణు పరమ శివుని భక్తుడిగా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ కాస్ట్ ఉండనున్నారని తెలుస్తోంది.

ఇక ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించనున్నారట. ప్రభాస్ సీన్స్ సినిమాకే హైలైట్ గా ఉండనున్నాయట. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ సీన్ ను భారీగా ప్లాన్ చేస్తున్నారట. సినిమాలో ఇంట్రెవెల్ బ్యాంగ్ లో సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని తెలుస్తోంది. అలాగే పార్వతి దేవిగా నయనతార నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్, మమ్ముట్టి, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కూడుతున్నాయి. ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలకృష్ణ కూడా నటిస్తున్నారట. గతంలో కూడా మంచు మనోజ్ హీరోగా నటించిన ఊకొడతారా.. ఉలిక్కిపడతారా.. సినిమాలో బాలకృష్ణ కీలక పాత్రలో నటించారు. ఇప్పుడు కన్నప్ప కోసం బాలయ్య రెడీ అవుతున్నారట.