‘చిన్నారి పెళ్లికూతురు’ బామ్మ సురేఖ సిఖ్రి కన్నుమూత

బాలికా వధు (చిన్నారి పెళ్లికూతరు) ఫేమ్‌ లెజెండరీ నటి సురేఖ సిఖ్రి (75) కన్నుమూశారు. గుండెపోటు కారణంగా సిఖ్రి మరణించిందని ఆమె మేనేజర్‌ మీడియాకు వివరించారు. గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న సిఖ్రి.. శుక్రవారం తుదిశ్వాస విడిచింది. ‘కిస్సా కుర్సి కా’ చిత్రంతో తెరంగేట్రం చేసిన సురేఖ సిఖ్రి తమాస్ (1988), మమ్మో (1995) బధాయ్ హో (2018) చిత్రాలకు గానూ ఉత్తమ నటిగా మూడు నేషనల్‌ అవార్డులు సంపాదించుకుంది.