నారా లోకేష్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

నారా లోకేష్‌పై బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు

బండ్ల గణేష్ మరోసారి ఏపీ రాజకీయ నేతలపై విమర్శలు గుప్పించారు. ఈసారి ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ పై విమర్శలు గుప్పించారు. గౌరవనీయులైన నారా లోకేష్ గారికి ప్రేమతో అంటూ తన ట్విట్టర్‌లో ట్వీట్ ప్రారంభించారు. వరుసగా లోకేష్‌ను ఉద్దేశిస్తూ 15 ట్వీట్లు చేశారు. రాజికీయాలంటే తనకు ఎంతో ఇష్టమైనప్పటికీ కూడా అవి చాలా కష్టం అనే వదిలేశానన్నారు బండ్ల. రాజకీయాల్లో వారసత్వం కాదు దమ్ము ధైర్యం ప్రజల్లో నమ్మకం, పోరాడుతాడు అన్న ప్రజలకు విశ్వాసం కల్పించడం రాజకీయ నాయకుడి లక్షణం అన్నారు. చంద్రబాబు నాయుడు కొడుకుగా పుట్టడం మీరు చేసుకున్న అదృష్టమంటూ నారా లోకేష్ పై ట్వీట్లు చేశారు. రాజకీయ పార్టీ అంటే సాఫ్ట్‌వేర్ కంపెనీ కాదన్నారు బండ్ల గణేష్.