దెబ్బకు వణికిపోయిన బండ్ల గణేష్

కమెడియన్‌గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత నిర్మాతగా మారి ఫుల్ పాపులారిటీ సంపాదించారు బండ్ల గణేష్. ఆ వెంటనే మరో అడుగు ముందుకేసి పాలిటిక్స్ లోకి వెళ్లిన ఆయన.. పొలిటీషియన్‌గా మాత్రం తుస్సుమన్నాడు. ఇక బిజినెస్‌మెన్‌గా, పవన్ కళ్యాణ్ వీరాభిమానిగా మనోడు చెప్పే ప్రతి విషయం ఆసక్తికరంగానే ఉంటూ వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్యకాలంలో అయితే సోషల్ మీడియాలో యమ యాక్టివ్ కావడంతో ఏదో ఒక రూపంలో ఆయనకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ కోవలోనే తాజాగా ఓ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

అన్నా.. బీజేపీలో చేరుతున్నావా? అని ఆ నెటిజన్ అడగడంతో బండ్ల గణేష్ ఒక్కసారిగా పరేషాన్ అయ్యారు. వద్దు బాబోయ్ అంటూ.. సింపుల్‌గా ‘నో పాలిటిక్స్ బ్రదర్’ అని పేర్కొంటూ చేతులెత్తి దండం పెట్టడం హాట్ టాపిక్ అయింది. దీంతో రాజకీయాల మాటెత్తితేనే మనోడు వణికిపోతున్నాడుగా అంటూ చర్చించుకుంటున్నారు జనం. పాపం! చేతులెత్తేసిన బండ్ల గణేష్‌ని పదే పదే ఆ పీడకల గుర్తు చేస్తూ బాధపెడుతున్నారని చెప్పుకుంటున్నారు.