మీ బాత్‌రూమ్ అందంగా మెరవాలంటే ఇలా చేయండి

మీ బాత్‌రూమ్ అందంగా మెరవాలంటే ఇలా చేయండి

చాలా మంది ఇంటిని అలంకరించుకునేటప్పుడు బన్ని రూమ్‌లను అలంకరిస్తారు కానీ, బాత్‌రూమ్‌ని మాత్రం అలా వదిలేస్తారు. హా ఎవరూ దాన్ని అంతగా పట్టించుకుంటారులే అనుకుంటారు. మరి మీరు వాడుతున్నారు కదా.. ఆ సమయంలో కూడా మీకూ బాత్ రూమ్ నీట్‌గా అందంగా కనిపించాలి.. అందుకోసం పెద్దగా వ్యయప్రయాసలు పడాల్సిన అవసరం లేదు.. 

బాత్ మ్యాట్స్..
ఏంటి మ్యాట్స్ అంత అవసరమా అని తీసిపారేయొద్దు. ఇది చాలా ముఖ్యం. కొంతమంది ఈ మ్యాట్స్‌ని వాడుతుంటారు. కానీ, ఏవి పడితే అవే వేస్తుంటారు. అయితే.. ఈ ఎంపికకి కూడా మీ క్రియేటివిటీని కాస్తా జోడించండి. మార్కెట్లో రకరకాల డిజైన్స్‌లో మ్యాట్స్ దొరుకుతున్నాయి. వాటిని మీ బాత్‌రూమ్‌కి ఎదురుగా వేయండి అప్పుడు లుక్కే మారిపోతుంది. అంతేనా..దీని వల్ల కాళ్ల తడి కూడా పోయేలా తుడుచుకోవచ్చు.

షవర్ కర్టెన్స్..
అదే విధంగా షవర్ కర్టెన్స్ కూడా మీ బాత్‌రూమ్‌ని లుక్‌ని మార్చేస్తాయి. చాలా మంది ప్లెయిన్‌ని వేస్తుంటారు. అలా కాకుండా.. ఇందులో గ్రాఫిక్స్‌తో కూడినవి వస్తున్నాయి. వాటిని వేయడం వల్ల బాత్ రూమ్ లుక్ మారిపోతుంది. కావాలంటే మీరూ ఓ సారి ట్రై చేయండి. వీటిని వేయడం వల్ల మీరు స్నానం చేసినప్పుడు ఆ నీరంతా కూడా బాత్‌రూమ్‌‌లో మొత్తం పడకుండా ఉంటుంది. కాబట్టి ఓ సారి ట్రై చేయండి.