బేకింగ్ సోడాతో కిడ్నీ సమస్యలు దూరం అవుతాయా..

బేకింగ్ సోడా లేని సరుకుల లిస్టు ఉండదు. వంట గదిలో అది ఉండి తీరాల్సిందే. మైసూర్ బజ్జీల మీదకి మనసు పోతే బేకింగ్ సోడా లేకపోతే పని జరగదు. అలాగని వంట సోడా వంటకే కాదు… ఇంకా చాలా వాటికి పనికొస్తుంది.

1. జీర్ణ సమస్యలు దూరం..

ఎక్కువ తిన్నా, సరిగ్గా అరక్కపోయినా, గుండెల్లో మంటగా అనిపిస్తుందని మనందరికీ తెలిసిన విషయమే. ఆ మంట పొట్టలో నించి గొంతు వరకూ తెలుస్తుంది. ఒక గ్లాసు చల్లని నీటిలో ఒక టీస్పూన్ బేకింగ్ సోడా వేసి కలిపి ఆ మిశ్రమాన్ని నెమ్మదిగా తాగితే గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. మౌత్ వాష్ గా..

మనం తింటున్న స్పైసీ ఫుడ్స్ కీ, తాగుతున్న కాఫీ టీలకీ కేవలం రెండు పూటలా పళ్ళు తోముకుంటే సరిపోదు. మౌత్ వాష్ కూడా అవసరం అవుతోంది. పైగా ఈ మౌత్ వాష్ బ్రష్ చేరుకోలేని ప్రదేశాలని కూడా శుభ్రం చేస్తుంది. అయితే, ఇందు కోసం ప్రత్యేకంగా మౌత్ వాష్ కొనుక్కోక్కర్లేదు. అర గ్లాసు గోరు వెచ్చని నీటిలో అర చెంచా బేకింగ్ సోడా వేసి మౌత్ వాష్ లా వాడొచ్చు. ఇది నోటి పుళ్ళని తగ్గించడమే కాకుండా పళ్ళు తెల్లగా మెరిసేటట్లు చేస్తుంది.

3. కిడ్నీ సమస్యలు దూరం..

క్రానిక్ కిడ్నీ డిసీజెస్ నెమ్మదిగా కిడ్నీ ఫెయిల్యూర్ కి దారి తీస్తాయి. అయితే బేకింగ్ సోడా సప్లిమెంట్లు తీసుకునే వారు ముప్ఫై ఆరు శాతం తక్కువ స్పీడ్ తో కిడ్నీ ఫెయిల్యూర్ దశ కి చేరుకుంటారని ఒక స్టడీ చెప్తోంది. కాబట్టి.. దీనిని మీ ఆహారంలో భాగం చేసుకోండి.