బిజెపికి ప్రముఖ నటి సుభద్రా ముఖర్జీ గుడ్‌ బై

బిజెపికి ప్రముఖ నటి సుభద్రా ముఖర్జీ గుడ్‌ బై

ప్రముఖ బెంగాలీ నటి, సుభద్రా ముఖర్జీ ఆ పార్టీకి రాజీనామా చేశారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఢిల్లీ అల్లర్లకు కారణమయ్యారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోనందుకు నిరసనగా తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె వెల్లడించారు. కపిల్‌ మిశ్రా, అనురాగ్‌ ఠాగూర్‌ వంటి నేతలున్న బిజెపిలో తాను కొనసాగలేనని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు. తాను ఎన్నో ”ఆశలతో” బిజెపి లో చేరాననీ.. కానీ ఇటీవల చోటుచేసుకున్న సంఘటనలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె అన్నారు. బిజెపి తన సిద్ధాంతాల నుంచి ”పక్కకు వెళ్లిపోతున్నట్టు” తనకు అనిపించిందన్నారు.