ట్రెండీ ఇంటిరీయర్ ఫర్నీచర్స్ ఇవే..!

ట్రెండీ ఇంటిరీయర్ ఫర్నీచర్స్ ఇవే..!

సంవత్సరాలుగా ఇంటీరియర్ డెకరేషన్లో ఎప్పటికప్పుడు అనేక మార్పులు వస్తుంటాయి. ఈ న్యూఇయర్ మీరు మీ ఇంటిని అందంగా మార్చుకోడానికి చూస్తున్నట్లయితే, ట్రెండీగా ఉన్న కొత్త కలెక్షన్ కోసం ఆన్‌లైన్ పోర్టల్స్‌ను చూడడం కామన్. మరి మీరు.. ఇంటి డెకరేషన్ కోసం ఆన్‌లైన్‌లో ఫర్నిచర్ కొనాలని ఆలోచిస్తున్నారా?

ఫోల్డబుల్ సాలిడ్ వుడ్ అవుట్ డోర్ సెట్ ..

ఈ ఫోల్డబుల్ సాలిడ్ వుడ్ అవుట్ డోర్ సెట్ ఇంట్లో తప్పనిసరిగా ఉండాల్సిన ఫర్నిచర్ అనే చెప్పొచ్చు. ఇది ఎక్కువ స్థలాన్ని ఆక్రమించదు. మడతపెట్టి గది మూలన స్టోర్ చేసేలా అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే, మీ అవసరం ప్రకారం, సీటింగ్‌ పెంచుకునే అవకాశం కూడా ఉంటుంది. టేకు చెక్కతో, ఆయిల్ ఫినిషింగ్ తో ఉండి అందంగా ఉంటుంది. ఇది మీ గార్డెన్, బాల్కనీకి సరిగ్గా సరిపోతుంది.. కుర్చీలకు కుషన్లను పెడితే చాలు.. ఇట్టే లుక్ మారిపోతుంది. ఈ కుషన్స్‌ని కూడా ఆన్‌లైన్ పోర్టల్స్‌లో సైజుల వారీగా కొనుక్కునే అవకాశం ఉంటుంది.

3డి ప్రింటెడ్ రన్నర్ కార్పెట్..

మీరు మీ ఇంట్లో రెగ్యులర్ గా కార్పెట్ ఉపయోగించకపోతే 3డి ప్రింటెడ్ రన్నర్ కార్పెట్స్ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అపార్టుమెంట్లలో, ఈ “3డి ప్రింటెడ్ రన్నర్ కార్పెట్లు” తక్కువ స్థలాన్ని ఆక్రమించడంతోపాటు ఎంతో సౌకర్యంగా ఉంటాయి. మీరు దీన్ని బెడ్‌రూమ్‌లోనే కాకుండా, లాంజర్ ముందు, బాల్కనీలో.. ఇలా ఎక్కడైనా వాడొచ్చు. మీకు ఆశ్చర్యం కలిగించేలా కొన్ని ప్రత్యేకమైన డిజైన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి 3డి ప్రింటెడ్ కాబట్టి, మీకు నచ్చిన డిజైన్ అడిగి చేయించుకునే అవకాశాన్ని కూడా కొన్ని కంపెనీలు అందిస్తున్నాయి.

పౌఫ్ స్టూల్స్..

2019 నుండి ఈ రకం ఫర్నిచర్ మంచి డిమాండ్ ఉంది. వీటిని పౌఫ్ స్టూల్స్ అంటారు. ఇవి చిన్నవిగానే కాకుండా చాలా అందంగా ఉంటాయి. అంతేకాక, వీటి డిజైన్స్ అద్భుతమనే చెప్పాలి. కాంపాక్ట్ మోడల్‌గా ఉన్నందువల్ల, తక్కువ కాలంలోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. ఇవి మీ ఇంటికి సరికొత్త అందాన్ని తీసుకుని వస్తాయి.