ప్రభాస్ తల్లిగా బాలీవుడ్ హీరోయిన్

ప్రభాస్ సినిమా వస్తుందంటే అభిమానులకు పండగే. ఇక ఈ యంగ్ రెబల్ స్టార్ సినిమాలో హీరోయిన్ దగ్గర నుంచి కీలక పాత్రల్లో ఎవరెవరూ నటిస్తారన్న విషయాలపై కూడా ఫ్యాన్స్ ఆరా తీస్తుంటారు. మిర్చి సినిమా ప్రభాస్‌కు ఎంత ఫేమ్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇక అందులో మన డార్లింగ్‌ ప్రభాస్‌కు తల్లిగా సీనియర్ హీరోయిన్ నదియా కరెక్ట్‌గా సరిపోయారు. ఓ అందమైన అబ్బాయికి అందమైన తల్లిగా ఆమె ఫర్‌ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. అయితే బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ తర్వాతి చిత్రాలలో కూడా అన్ని చోట్ల నుండి నటులని తీసుకుంటున్నారు. సాహో సినిమాలో కూడా మనం బాలీవుడ్ నటుల్నిచాలామందిని చూశాం.

అయితే ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాక్రిష్ణ దర్శకత్వంలో ప్రభాస్ లవ్ స్టోరీ చేస్తున్నాడు. పీరియాడిక్ లవ్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కుతుందని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే కనిపించనుంది. ఇకపోతే ప్రభాస్, పూజా తర్వాత ఈ సినిమాలో కనిపించే స్టార్ క్యాస్ట్ పై రకరకాల వార్తలు వస్తున్నాయి. ఇప్పుడున్న సమాచారం ప్రకారం బాలీవుడ్ సీనియర్ నటి భాగ్యశ్రీ ఈ సినిమాలో ఒకానొక ప్రత్యేక పాత్రలో కనిపించనుందని తెలుస్తుంది. సల్మాన్ ఖాన్ హీరోగా మైనే ప్యార్ కియా సినిమాలో నటించిన భాగ్యశ్రీ ప్రభాస్ కొత్త సినిమాలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. చాలా రోజుల వరకూ సినిమాలకి దూరంగా ఉంటూ వస్తున్న భాగ్యశ్రీ ఈ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనుంది.

అయితే ఈ విషయాన్ని మూవీ టీం అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ గతంలో ప్రభాసే ఈ విషయాన్ని తెలిపినట్లు అంతా చర్చించుకుంటున్నారు. మామూలుగా అయితే ప్రభాస్ పెద్దగా సొషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండడు. అయితే తన ఇన్స్టాగ్రామ్ ద్వారా భాగ్యశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. దీంతో ఆమె ఈ సినిమా నటిస్తుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఆమె ప్రభాస్‌కు తల్లిగా నటించనుందా ? మరేమైనా లాడ్ రోల్‌ చేయనుందా అన్ని మాత్రం ఇప్పటికి సస్పెన్స్.