రేపు ‘భీమ్లా నాయక్‌’ టైటిల్‌ సాంగ్‌ విడుదల

పవన్ అభిమానుల్లో సంబరాలు నింపారు భీమ్లా నాయక్ యూనిట్. సెప్టెంబర్ 2న ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని గతంలోనే తెలిపిన యూనిట్..ఆ టైం తెలిపి అభిమానుల్లో ఉత్సహం నింపారు. సెప్టెంబర్ 2న ఉదయం పదకొండు గంటల 16 నిమిషాలకు ఫస్ట్ సింగిల్ రాబోతోందని ప్రకటించారు. ఈ మేరకు వదిలిన పోస్టర్ లో పవన్.. పవర్ ఫుల్ గన్ను పట్టుకున్న నిల్చున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే వదిలిన భీమ్లా నాయక్ ఫస్ట్ గ్లింప్స్ రికార్డ్స్ మోత మోగిస్తుండగా..ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ఏ రేంజ్ లో రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో అని అంత మాట్లాడుకుంటున్నారు.