టాలీవుడ్ హీరో చిరంజీవి నటిస్తోన్న తాజా చిత్రాల్లో ఒకటి భోళా శంకర్ . వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న ఈ మూవీని మెహర్ రమేశ్ డైరెక్ట్ చేస్తున్నాడు. కోలీవుడ్ భామ కీర్తిసురేశ్ ఈ చిత్రంలో చిరంజీవి సోదరిగా కనిపించనుంది. మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. భోళాశంకర్ టీం నుంచి ఆసక్తికర వార్త తెరపైకి వచ్చింది.
నవంబర్ 6న సినిమాను లాంఛ్ చేసేందుకు గ్రాండ్‌గా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నవంబర్ 15 నుంచి భోళా శంకర్ షూటింగ్ షురూ కానుంది. తొలి షెడ్యూల్లో చిరంజీవి, కీర్తిసురేశ్‌పై వచ్చే సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. మరో అప్డేట్ ఏంటంటే ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తున్న తమన్నా వచ్చే జనవరి నుంచి సెట్స్ లో జాయిన్ కానుంది. తాజా అప్డేట్తో అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని నింపుతున్నాడు చిరు.